ఉత్తర ఉన్నికృష్ణన్ |
---|
At Theri Audio Launch |
|
జననం | (2004-06-11) 2004 జూన్ 11 (వయసు 20) |
---|
క్రియాశీల కాలం | 2012–ప్రస్తుతం |
---|
ఉత్తర ఉన్నికృష్ణన్ (జననం 2004 జూన్ 11) భారతీయ నేపథ్య గాయని. 2015లో ఆమె జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకొంది. 2014లో విడుదలైన తమిళ సినిమా శైవంలో ఆమె పాడిన అళగు పాటకు ఈ పురస్కారం లభించింది. 62వ జాతీయ సినీ పురస్కారాల్లో ఆమె పురస్కారాన్ని అందుకొంది. ఆమె 7వ ఏటే ఉత్తర పాడిన పాట రికార్డు ఆయింది. ఆమె తన 10వ ఏటే జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకొంది.[1][2]
జీవిత సంగ్రహం
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు ఉన్ని కృష్ణన్, భరతనాట్య కళాకారిణి ప్రియా ఉన్నికృష్ణన్ ల కుమార్తె. ఆమె తండ్రి ఉన్ని కృష్ణన్ ఎన్నో జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాలు అందుకొన్నాడు. అతను 1995లో మొట్టమొదటి జాతీయ అవార్డు అందుకొన్నాడు.
ఆమె గురువు సుధా రాజా వద్ద తన ఆరవ ఏట నుండే కర్ణాటక సంగీతంలో శిక్షణ ప్రారంభించింది. చెట్ పేట్ లోని లేడీ ఆండాల్ స్కూల్ లో చదువుకుంటోంది ఉత్తర.[3] ఆమెకు కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలు రెండూ బాగా ఇష్టం. ఆ రెండు సంగీతాలూ నేర్చుకోవాలనేది ఆమె కోరిక.[4]
అవార్డు తెచ్చిన పాట..
ఉత్తరకు జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన అళగు పాటను జి. వి. ప్రకాష్ స్వరపరచగా, నా.ముత్తుకుమార్ రాశారు. ముత్తుకుమార్ కు కూడా జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం లభించింది ఈ పాటకు.[5] గాయని సైంధవి ఇంట్లో బొమ్మలకొలువుకు వెళ్ళినప్పుడు ఆమె గొంతు విన్న సైంధవి భర్త జి.వి.ప్రకాష్ కొన్ని నెలల తరువాత ఈ పాట పాడేందుకు అవకాశం ఇచ్చాడు.[6] ఈ పాటతో పాటు తమిళంలో మరో రెండు పాటలు పాడింది ఉత్తర.[7]
మూలాలు