ఈ తరం మనిషి 1977లో విడుదలైన తెలుగు సినిమా. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.వెంకటరత్నం, కె.రవీంద్రనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, లక్ష్మీ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం మాదిరెడ్డి సులోచన వ్రాసిన "మిస్టర్ సంపత్ ఎం.ఎ" నవల ఆధారంగా తీశారు.