ఇస్రో ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాల యొక్క అన్ని ద్రవ, క్రయోజెనిక్, సెమిక్రియోజెనిక్ దశల పరీక్షలు, ఇంజిన్ సంబంధిత పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తారు. "జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా"గా పిలవదగ్గ కేంద్రమిది. [4]
సౌకర్యాలు
ఈ కాంప్లెక్సులో కింది సౌకర్యాలున్నాయి
ప్రయోగ వాహన మోటార్లు, దశల అసెంబ్లీ, ఏకీకరణ, పరీక్ష
ప్రయోగ వాహన మోటార్లు, దశల నిర్వహణ
ప్రొపెల్లెంట్ నిల్వ
వికాస్, పిఎస్ 2 / జిఎస్ 2, పిఎస్ 4, ఎల్ 40, ఎల్ 110, ఎస్ 200, సిఇ -7.5, సిఇ -20 క్రయోజెనిక్ ఇంజన్లు, స్టీరింగ్ ఇంజిన్ల సముద్ర మట్టం వద్ద పరీక్ష, అధిక ఎత్తులో చేసే పరీక్షలు [5]
L40, CE-7.5 అభివృద్ధి, అర్హత పరీక్షలు
PSLV, GSLV మిషన్ల కోసం వివిధ దశలు PS2 / GS2, PS4, L40 ల అసెంబ్లీ, ఏకీకరణ
ఉపగ్రహాల కోసం LAM ఇంజిన్, AOCS థ్రస్టర్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్