అంజద్ అలీఖాన్

అంజద్ అలీ ఖాన్
వ్యక్తిగత సమాచారం
మూలంభారత్
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ సంగీతము
వాయిద్యాలుసరోద్
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైట్

అంజద్ అలీఖాన్ : ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ( జననం- 1945 అక్టోబరు 9 ) ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.

బాల్యం

గ్వాలియర్ రాజవంశపు ఆస్థాన సరోద్ విద్వాంసుడైన, తండ్రి హఫీజ్ అలీఖాన్ వద్ద అంజద్ అలీఖాన్ సరోద్ వాదనం నేర్చుకొన్నాడు. ఆయన తండ్రితాతలు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు, తమ వెంట తెచ్చిన రబాబ్ (Rabab) ను క్రమంగా సరోద్‌గా తీర్చిదిద్దారు. ఈనాటి సరోద్ సేనియా మైహర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అతని సోదరుడు ఉస్తాద్ ఆయెత్ అలీఖాన్ చేతిలో ఎన్నో మార్పులకు గురైంది.

సంగీత ప్రస్థానం

ఖాన్ సరోద్ వాదనాన్ని ఒక ప్రత్యేక శైలిలో అభివృద్ధి పరిచాడు. గాత్రసంగీతంలోని క్లిష్టమైన 'తాన్ల'ను, ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్‌పై అలవోకగా పలికిస్తాడు. మరొక ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు, ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్కు సరోద్‌లు తయారు చేసే కోల్‌కతా లోని 'హెమెన్ సేన్ ' అంజద్ అలీఖాన్‌కు సరోద్‌లు తయారుచేసి ఇస్తాడు. గత 40 ఏళ్ళుగా అంజద్ అలీఖాన్‌ దేశవిదేశాల్లో సరోద్ కచేరీల ప్రదర్శనల నిస్తున్నాడు.

వివాహం

అంజద్ అలీఖాన్‌కు సుబ్బులక్ష్మితో వివాహం జరిగింది. కొడుకులు అయాన్, అమాన్‌లు తండ్రి వారసత్వంగా, సరోద్‌నే వాయిస్తున్నారు.

అవార్డులు

  1. 2001 లో పద్మ విభూషణ్ పురస్కారం.
  2. 2004 లో Fukuoka Asian Culture Prize.
  3. 1997 లో హూస్టన్ (Houston), Tulsa, Nashville లు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేశాయి.
  4. 1984 లో Massachusetts, ఏప్రిల్ 20 తేదీని అంజద్ అలీఖాన్‌ దినంగా ప్రకటించింది.

సంతకము

బయటి లింకులు

  • [1] హిందూ దినపత్రికలో
  • [2] Archived 2006-01-10 at the Wayback Machine హిందూ దినపత్రికలో
  • [3] అంజద్ అలీఖాన్‌ వెబ్‌సైట్

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!