సేవకుడు (2013 సినిమా)

సేవకుడు
సేవకుడు సినిమా పోస్టర్
దర్శకత్వంవి. సముద్ర
రచనస్వామీజీ - విజయ్
నిర్మాతముత్తినేని సత్యనారాయణ
తారాగణంశ్రీకాంత్, ఛార్మీ కౌర్
ఛాయాగ్రహణంఎం. సుధాకర్
కూర్పునందమూరి హరి
సంగీతంశ్రీకాంత్ దేవా
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకట రమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ స్టూడియో
విడుదల తేదీ
4 జనవరి 2013 (2013-01-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

సేవకుడు, 2013 జనవరి 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట రమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ స్టూడియో బ్యానరులో ముత్తినేని సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి. సముద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీకాంత్, ఛార్మి కౌర్ నటించగా శ్రీకాంత్ దేవా సంగీంతం అందించాడు. ఇది 2014లో తమిళంలో ఇని ఓరు విధి సీవోమ్గా విడుదలైంది.[1]

నటవర్గం

నిర్మాణం

2010లో శ్రీకాంత్, విమలా రామన్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా ప్రారంభించబడింది. కొన్ని కారణాల వల్ల రామన్ స్థానంలో ఛార్మీ కౌర్ తీసుకున్నారు.[2] షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా 2013లో విడుదలైంది.[3] ఇందులో అతిథి పాత్రలను పోషించడానికి మంజుల ఘట్టమనేని, కృష్ణ అంగీకరించారు.[4]

పాటలు

ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా సంగీతం అందించాడు.[5] అభినయ శ్రీనివాస్, గురుచరణ్. తైదల బాపు, ఈశ్వర్ తేజ, విష్ణువర్మ పాటలు రాశారు.[6]

  1. అబ్బాయి ఆంధ్రా మిర్చి (రచన: అభినయ శ్రీనివాస్, గనం: రంజిత్, శ్రావ్య)
  2. ఆ దేవుడు పుట్టించాడు (రచన: తైదల బాపు, గానం: హరీష్ రాఘవేంద్ర, చిన్మయి శ్రీపాద)
  3. గుడ్డు గుడ్డు (రచన: అభినయ శ్రీనివాస్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  4. మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో (రచన: గురుచరణ్, గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్)
  5. అడుగడుగో సేవకుడు (రచన: ఈశ్వర్ తేజ, విష్ణుశర్మ, గానం: మనో)

విడుదల

ఈ సినిమా 2012 ఫిబ్రవరిలో విడుదలకావాల్సి ఉండగా, 2013 జనవరిలో విడుదలైంది.[4] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది.[7] న్యూస్ 18 ఈ సినిమాకి మిశ్రమ స్పందన రాసింది.[8]

మూలాలు

  1. subramanian, anupama (June 13, 2014). "Charmi to make a comeback?". Deccan Chronicle. Retrieved 28 April 2021.
  2. "Vimala turns glam for Sevakudu - Indian Express". archive.indianexpress.com. Retrieved 28 April 2021.
  3. "Srikanth's next to address nation's burning issues - Times of India". The Times of India. Retrieved 28 April 2021.
  4. 4.0 4.1 "Srikanth's Sevakudu set for Feb release". The New Indian Express. Retrieved 28 April 2021.
  5. "Sevakudu Songs Download". Naa Songs. 2014-03-18. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Sevakudu 2013 Telugu Movie Songs". MovieGQ. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Sevakudu Movie Review {1.5/5}: Critic Review of Sevakudu by Times of India". Retrieved 28 April 2021 – via timesofindia.indiatimes.com.
  8. "'Sevakudu' Review: The film is a half hearted entertainment". News18. Retrieved 28 April 2021.

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!