సందీప్ కిషన్ |
---|
|
జననం | (1987-05-07) 1987 మే 7 (వయసు 37)
|
---|
జాతీయత | భారతీయుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2008–present |
---|
బంధువులు | |
---|
సందీప్ కిషన్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో కనిపించే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. గతంలో ఇతను దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు.
ప్రారంభ జీవితం, విద్య
సందీప్ చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో మే 7 1987 న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఆయన చెన్నైలోని లయోలా కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆయన బంధువులు "ఛోటా కె.నాయుడు", "శ్యాం కె.నాయుడు.[1][2]
కెరీర్
'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్ తెలుగు వాడు. తెలుగులో 'ఎల్.బి.డబ్యూ'ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుటున్న 'యారుడ మహేష్' అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్ యాక్షన్ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
మీడియా విషయాలు
జూన్ 2014 లో ఆయన తాగిన మత్తులో కారు నడుపడం వల్ల అరెస్టు కాబడినాడని మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. దానికి ఆయన ప్రతిస్పందిస్తూ మీడియా నిజాలను పరిశీలించి సరైన విధంగా ప్రచురించాలని కోరాడు.[3]
ఫిల్మోగ్రఫీ
వెబ్ సిరీస్
సంవత్సరం
|
సిరీస్
|
పాత్ర
|
భాష
|
నెట్‌వర్క్
|
2019
|
ది ఫ్యామిలీ మ్యాన్
|
మేజర్ విక్రమ్
|
హిందీ
|
అమెజాన్ ప్రైమ్
|
మూలాలు
ఇతర లింకులు
బాహ్యా లంకెలు