శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, [1] అనివార్య కారణాల వల్ల వాయిదా పడి[2] 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[3][4]
చిత్ర నిర్మాణం
గుణశేఖర్ ఈ సినిమాను 2020 అక్టోబరు 9న తెరకెక్కిస్తునట్టు ప్రకటించాడు.[5] ఈ చిత్ర షూటింగ్ 2021 మార్చి 21 న ప్రారంభమైంది.తొలి సన్నివేశానికి ‘దిల్’ రాజు కెమెరా స్విచాఫ్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చాడు.[6]ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 2022 ఫిబ్రవరి 21న విడుదలైంది.[7]
న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ కేటగిరిల్లో రెండు అవార్డులను గెలుచుకుంది.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో నాలుగు అవార్డులను గెలుచుకుంది.[13]