శశి కపూర్ |
---|
|
జననం | బల్‌బీర్ రాజ్ పృధ్వీరాజ్ కపూర్ (1938-03-18)1938 మార్చి 18 [1]
|
---|
మరణం | 2017 డిసెంబరు 4(2017-12-04) (వయసు 79)
|
---|
ఇతర పేర్లు | బల్బీర్ శశి బల్బీర్ రాజ్ షాషా శశి బాబా |
---|
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1941–1999 (విరమణ) |
---|
ఎత్తు | 1.83 మీటర్లు |
---|
జీవిత భాగస్వామి | జెన్నిఫర్ కెండల్ (1958–1984) |
---|
పిల్లలు | కునాల్ కపూర్ కరణ్ కపూర్ సంజనా కపూర్ |
---|
తల్లిదండ్రులు | పృథ్వీరాజ్ కపూర్ |
---|
బంధువులు | కపూర్ కుటుంబం |
---|
శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఆయన 1938 మార్చి 18న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బహుమతి ప్రదానం చేసింది.
కెరీర్
శశి కపూర్ నాలుగు సంవత్సరాల పిన్న వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ తోపాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించాడు.1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండటంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1950లో వచ్చిన సంగ్రామ్ చిత్రంలో అశోక్ కుమార్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. 1948-54 మధ్యలో నాలుగు హిందీ చిత్రాలలో (ఉత్సవ్) నటించాడు.
మరణం
శశికపూర్ ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్లో 2017 డిసెంబరు 4న మరణించాడు.[2]
సినిమాలు
- న్యూ ఢిల్లీ టైమ్స్ (1986)
మూలాలు