శంకర్ మహదేవన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త, గాయకుడు. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన శంకర్-ఎహ్సాన్-లోయ్ జట్టులో ఒక భాగం అతను. ఈ జట్టు భారతీయ చలన చిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపధ్య గానాన్ని అందిస్తుంది. ఇతను ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. ఇతను శంకర్ మహదేవన్ అకాడమీ స్థాపకుడు కూడా,ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు భారతీయ సంగీతంలో ఆన్లైన్ సంగీత పాఠాలను నిర్వహిస్తుంది.
ప్రారంభ జీవితం
శంకర్ మహదేవన్ ముంబై శివారు ప్రాంతమైన చెంబూరులో పుట్టి, పెరిగాడు.[2] ఇతను కేరళలోని పాలక్కాడ్ నుండి వచ్చిన తమిళ అయ్యర్ కుటుంబానికి చెందినవాడు. ఇతను తన బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఐదు సంవత్సరాల వయసులో వీణ వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ శ్రీనివాస్ ఖలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. ఇతను చెంబూర్ లో ఉన్న అవర్ లాడీ ఆఫ్ పర్‌పెచువల్ సకర్ ఉన్నత పాఠశాలలో (Our Lady of Perpetual Succour High School) చదివాడు.తరువాత ఇతను సియోన్ లో ఎస్ఐఇసి, కళాశాలలో చేరి తన ఎచ్ఎ.స్.సి. పూర్తి చేసాడు.ఇతను1988 లో న్యూ ముంబైలో ముంబై విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న రాంరావ్ ఆదిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. ఒరాకిల్కు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు.
వృత్తి జీవితం
కొంతకాలం పనిచేసిన తర్వాత శంకర్ సంగీత రంగంలోకి అడుగు పెట్టాడు.[2] అతను నేపధ్యగాయకునిగా ఒక తమిళ చిత్రంలో మొదటి అవార్డు సాధించాడు. కన్డుకొండైన్ కన్డుకొండైన్ లో ఎ.ఆర్. రెహమాన్ తో కలిసి అతని పాట కోసం పనిచేశాడు. జాతీయ చలన చిత్ర అవార్డు పొందాడు. 1998లో తన మొదటి సంగీత అల్బం బ్రీత్లెస్ విడుదలతో కడమ్‌బక్కం చిత్ర పరిశ్రమలో అతను ప్రముఖ స్టార్‌గా మరింత గుర్తింపు పొందాడు. ఆల్బం టైటిల్ ట్రాక్ ఏ విరామం లేకుండా పాడుకునే పద్ధతిలో తయారు చేశాడు, కాబట్టి అది ఒక శ్వాసలో పాడినట్లుగా కనిపిస్తుంది. అందువలన దీనికి బ్రీత్లెస్ టైటిల్ సరిపోయింది. అతను తరువాత సంగీత దర్శకత్వంలోకి వచ్చాడు. శంకర్-ఎహసాన్-లాయ్ త్రయంలో భాగమై హిందీ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నాడు.
పురస్కారాలు
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ గాయకుడు (ఒక్కడే దేవుడు - శిరిడి సాయి)[3][4][5][6]
మూలాలు
వెలుపలి లంకెలు