విజయనగరము ప్రభలమైన సైనిక శక్తి ఉంది. విజయనగర రాజులకు సామంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచారు. రెండవ దేవ రాయలు (ప్రౌఢ దేవ రాయలు) ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించారు.
విజయనగర కాలం నాటి సైనిక విధానం
విజయనగరం చక్రవర్తులు నిరంతరం బహమనీ సుల్తాను పాలకులచే పోరాడవలసి రావడంతో వారు సైనిక రాజ్యమును తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే వారికి వచ్చే ఆదాయంలో సైనిక రంగ నిర్వహణకు దాదాపు అర్థ భాగం ఖర్చు చేసేవారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సైనిక విధానమును మిగతా పాలకులు కూడా దాదాపు పాటించారని చెప్పవచ్చును.
విభాగములు
విజయనగర చక్రవర్తుల కాలం నాటి సైన్యమును రెండు విభాగాలుగా విభజించవచ్చును. అందులో ఒకటి చక్రవర్తి సైన్యం. చక్రవర్తి సైన్యం ఎన్నిక, శిక్షణ, యుద్ధకాలంలో నిఅర్వహణ, చక్రవర్తి లేదా దండనాయకులచే నిర్వహించబడును. ఈ వ్యవస్థను "కందాచార శాఖ" పర్యవేక్షణలో విజయనగర పాలకులు కొనసాగించారు. నౌకా బలం, అశ్విక బలం లతో పాటు కాల్బలం సేవలను కూడా వినియోగించుకున్నారు. మేలు రకం అశ్వాలను ఇరాన్, పర్షియా, పోర్చుగీసు ప్రాంతాల నుండి దిగుమతి చేసుకొనేవారని చారిత్రిక ఆధారాలున్నాయి.
దళాలు
- పదాతి దళము
- గజ దళము
- అశ్విక దళము
అను విభాగములు ఉన్నాయి. చివరలో పిరంగి దళము, తుపాకి దళములు కూడా ఉండెను
ఆయుధములు
సాధారణ సైనికునకు శిరస్త్రానము, ధనుర్బాణాలు, డాలు, కత్తి ఉండేవి, ఇంకా ఈటె మొన్నగు ఆయుధములు కూడా ఉన్నాయి.
విశేషములు
ఈ సైన్యము ముఖ్యముగా రెండు రకములగా ఉండేవి
సిద్ద సైన్యము
అనగా ఇది కేంద్ర పరిపాలనలో ఉండే సైన్యము, ఇది సుమారుగా లక్ష మంది వరకూ ఉండేది (కృష్ణ దేవరాయల సమయమున)
దీనికి జీత భత్యములు అన్నీ కేంద్ర ఖజానా నుండే వచ్చేది
అమరనాయంకర సైన్యము
అమరసైన్యం లేదా నాయకర సైన్యము లేదా సామంత సైన్యము, దీనిని సామంతులు చూసుకునేవరు, అవసరమైనప్పుడు రాజునకు పంపించేవారు
విజయనగరం పాలనా కాలం నాటి సైన్యంలో మరొక ముఖ్యమైన అంశం, విజయనగర చక్రవర్తులు అపార విజయాలు సాధించడానికి కారణమైంది ఈ సైన్యం> అమర నాయకుల అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సైనిక పటాలములు, కఠోర సైన్యము, క్రమశిక్షణతో కూడిన పద్ధతులచే పోషించబడేది. స్థానిక భద్రతలను కాపాడడంతో పాటు విదేశీ దండయాత్రల కాలంలో చక్రవర్తి ఆదేశాల మేరకు పనిచేసి విజయనగర సామ్రాజ్య పటిష్టతకు శ్రమించాల్సి రావడం వీరి ప్రధాన విధి. ఈ సైన్యం ఎన్నిక, సైన్యం శిక్షణ, యుద్ధ కాలంలో సైన్యాన్ని నిర్వహించే బాద్యత అమరనాయకులు చూసుకొనేవారు. వీరు ప్రముఖ కొండ జాయి ప్రజలైన తుళు, కబ్బతి, మొరస, కోయలు, చెంచులు మొదలగువారిని సైనికులుగా నియమించి వారి శౌర్య, పరాక్రమాలతో అనేక విజయాలను విజయనగర సామ్రాజ్యానికి సాధించి పెట్టారు.[1]
మూలాలు