18 ఫిబ్రవరి 2014; 10 సంవత్సరాల క్రితం (2014-02-18)[1]
వికాస్ పీడియా (భారత ప్రగతి ద్వారం)
“వికాస్ పీడియా” అనేది, గ్రామీణ సాధికారతకు అంకితమైన ఒక జాతీయస్థాయి పోర్టల్. ఇది గ్రామీణ సాధికారతకు ఉజ్వలమైన సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం (ఐ.సి.టి) ద్వారా ఇ-విజ్ఞానం అందించటానికి ఏర్పడింది.
భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా బహు భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పోర్టల్ 6 ముఖ్యమైన జీవనోపాధి రంగాలు అనగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, శక్తి వనరులు, సామాజిక సంక్షేమం, ఇ-పాలన లకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది గ్రామీణ, సమాజాభివృద్ధికి అంతర్జాల సౌకర్యంతో సమాచారాన్ని అందరికి అందుబాటులోకి తీసుకు రావడానికి ఉద్దేశించి భారత ప్రభుత్వ ఎర్పాటు చెయబదినది. ఇది ఇంగ్లీషుతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ మొదలైన భారతీయ భాషలలో ఉంది. దీనిని, సి-డాక్, హైదరాబాద్ నిర్వహిస్తున్నది.
వికాస్ పీడియా బహుభాషా పోర్టల్ ను మరింత మెరుగు పరిచేందుకు ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), వారు ఇండియన్ గ్రామీన్ సర్వీసెస్ (ఐ.జి.ఎస్.) సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ (ఎస్.ఎన్.ఏ.) గా ఎంపిక చేసింది.
దీనిలో ప్రధాన విభాగాలు
వ్యవసాయం
ఈ విభాగంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాటించే అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.
ఆరోగ్యం
ఈ విభాగంలో గ్రామీణ భారతదేశ ప్రజలకు ఆరోగ్య భద్రత పైన ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యానికి గల ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం, దానికి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడం ఈ బహు బాషా పోర్టల్ యొక్క లక్ష్యం. ఈ పోర్టల్ లో దీనికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక చికిత్స, వ్యాధులు గురించి సమాచారం కల్పిస్తుంది.
విద్య
ఈ విభాగంలో ప్రాథమిక విద్య, బాలల హక్కులు, పధకాలు, స్కీములు, బాలల ప్రపంచం, ఉపాధ్యాయ వేదిక, విద్య - ఉత్తమ పధ్ధతులు మొదలగున అంశాల గురించి సమాచారం కల్పిస్తుంది
సామాజిక సంక్షేమం
ఈ విభాగంలో సామాజిక సంక్షేమానికి సంబంధించిన అంశాల గురించి సమాచారం కల్పిస్తుంది
శక్తి వనరులు
ఈ విభాగంలో గ్రామీణ శక్తికి సంబంధించిన సమాచారం కల్పిస్తుంది
ఇ-పాలన
ఈ విభాగంలో ఇండియాలో ఇ-పాలనకు సంబంధించిన సమాచారం కల్పిస్తుంది
సమాచార, సంచార సాంకేతిక రంగం, దానిని ఉపయోగించుకొనడానికి శిక్షణ, వాటికవసరమైన పుస్తకాలు కూడా దీని ద్వారా పొందవచ్చు . ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు[2] అనే పుస్తకాలు తెలుగులో తయారు చేసింది.
ఈ పోర్టల్ ప్రజలందరికి, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు మరింత చేరువ అవ్వటానికి మన అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతుంది. ఈ పోర్టల్ మన కోసం, మన ఊరి కోసం, సమాజం కోసం, దేశం కోసం… మనం స్వచ్ఛంద్ధంగా ఈ పోర్టల్ లో సమాచారాన్ని పెంపొందించవచ్చు. ఇందుకు గాను ముందుగా మీరు ఈ పోర్టల్ లో విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోవలెను. నమోదు చేసుకున్న తర్వాత విషయాన్ని పొందుపరచవచ్చు. ఈ పోర్టల్ లో ఏ విధంగా నమోదు చేసుకోవాలో, విషయాన్ని ఏ విధంగా పొందుపరచాలో పోర్టల్ పేజిArchived 2014-07-06 at the Wayback Machineలో ఉంటుంది.
భాగస్వామ్యం
వికాస్ పీడియా అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే, నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను మెరుగుపరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది
వికాస్ పీడియా ప్రతి రాష్ట్రంలో విషయ సమాచారాభివృద్ధి, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ పొర్తల్ రానున్న కాలంలో అన్ని భారతీయ భాషలు అనువదించనుంది.
పనితీరు గణాంకాలు
సగటు వాడుకరుల సంఖ్య మార్చి 2010 లో 2630 వుండగా అది మార్చి 2011 నాటికి 4460 కు చేరింది. ఎనిమిది భాషలకు కలిపి సగటు రోజు వారి పేజీ వీక్షణలు 13350 గా నమోదు అయ్యాయి.[3] మార్చి 2011 లో ఒక్క తెలుగు వికీపీడియా సగటురోజు వీక్షణలు దాదాపు 80000 గా ఉంది.[4]