బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు.
వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.
భాషా విశేషాలు
బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉంది.[1] కక్కు [ kakku ] kakku. తెలుగు v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.