వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది.[1][2] వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాలయంలో మే 30న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేశాడు.రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించాడు.[3]
జననం, విద్యాభాస్యం
వద్దిరాజు రవిచంద్ర 1965లో తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, కేసముద్రం మండలం, ఇనుగుర్తి గ్రామంలో జన్మించాడు. ఆయన వరంగల్ జిల్లా, దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ చేరి చదువును మధ్యలో ఆపివేసి తండ్రి స్థాపించిన రైస్ మిల్లును 12 సంవత్సరాల వయస్సులోనే బాధ్యతలు చేపట్టి క్రమక్రమంగా గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు.[4]
రాజకీయ జీవితం
వద్దిరాజు రవిచంద్ర గాయత్రి గ్రానైట్స్ అధినేత. ఆయన ప్రస్తుతం తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ మున్నూరుకాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షులుగా పని చేస్తున్నాడు. వద్దిరాజు రవిచంద్ర 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ చేతిలో ఓడిపోయాడు. నన్నపనేని నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి.
వద్దిరాజు రవిచంద్ర 2019 ఏప్రిల్ 7న కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5] ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది.[6][7][8] [9]వద్దిరాజు రవిచంద్ర మే 19న నామినేషన్ దాఖలు చేయగా, రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఉపసంహరణ గడువు ముగిశాక మే 24న ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించాడు.[10]వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో మే 30న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేశాడు.రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆయనతో ప్రమాణం చేయించాడు.[11]
వద్దిరాజు రవిచంద్రను 2024లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా ఫిబ్రవరి 14న పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేశాడు.[12] ఆయన రెండోసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికై,[13] 2024 జూన్ 23న రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమితుడయ్యాడు.[14]
మూలాలు