రేవతి తెలుగు సినిమా నటీమణి. ఆశా (సినిమాలో పేరు రేవతి అని పిలుస్తారు), ఒక భారతీయ చలనచిత్ర నటి, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా, తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనలో పేరు ప్రసిద్ధి చెందినది.[5]
మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (సౌత్) వాటితో ఆమె అనేక ప్రసంశలు గెలుచుకుంది.[6]
రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు, ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సం.లో చెన్నైలో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది.[7]
సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.[8]
జననం
రేవతి కొచ్చిలో ఆశా కేలుని నాయర్ అనే పేరుతో కల్లిక్కాడ్, పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన, భారతీయ సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి అయిన కేలుని నాయర్, లలితే కేలున్ని దంపతులకు జనించింది. మలయాళ నటి గీతా విజయన్ ఈమె బంధువు.[9]
వ్యక్తిగత జీవితం
రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నది. ఈ జంటకు పిల్లలు లేరు. అయితే వీరి మధ్య వచ్చిన కుటుంబ మానసిక తేడాలు తరువాత, వీరు 2002 సం.నుండి విడిగా జీవిస్తూ,[10] 2013 ఏప్రిల్ 23 సం.న చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం కోర్టు వీరికి విడాకులు మంజూరు చేశారు.[11]
నట జీవితం
ఆమె చాలా తక్కువ సంఖ్యలో వివిధ భాషా సినిమాలలో నటించింది.
డబ్బింగ్ కళాకారిణి
1995-పాంపన్ (శరణ్య పొన్వన్నన్ కోసం) - తమిళ సినిమా
1995 -అసాయి (సువాల్లక్ష్మి కోసం) - తమిళ సినిమా
1996-దేవరాగం (శ్రీదేవి కోసం) - మలయాళం సినిమా
1997 -మిన్సార కనవు (కజోల్ కోసం) - తమిళ సినిమా
1999-మేఘం (పూజా బత్రా కోసం) - మలయాళం మూవీ
2000 - కందుకొండైన్ కందుకొండైన్ (టబు కోసం) - తమిళ సినిమా
2001 -వేదం (దివ్య యునీ కోసం) - తమిళ సినిమా
2005 -చంద్రోల్సవం (కుష్బూ కోసం) - మలయాళం సినిమా
2018 పుణ్యకోటి (ఆవు కోసం) - సంస్కృతం సినిమా
దర్శకురాలు
2002 మిట్ర్ మై ఫ్రెండ్ : ఆంగ్లంలో ఉత్తమ చలన చిత్రంగా ఆంగ్ల జాతీయ చలన చిత్ర పురస్కారం