భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకుని మొక్కకు అందించడం వేరు ముఖ్యమైన పనులు. మొక్కల్లో వేరు వ్యవస్థలు రెండు రకాలు.
తల్లివేరు వ్యవస్థ
గుబురు వేరువ్యవస్థ
తల్లివేరు వ్యవస్థలో ఒక వేరు మొక్క నుంచి ఏర్పడి నేలలోకి నిట్ట నిలువుగా పెరుగుతుంది. దీని నుంచి చిన్న వేళ్ళు పార్శ్వంగా శాఖలుగా నేలలోకి పెరుగుతాయి. ఇలాంటి వ్యవస్థ ద్విదళ బీజాల్లో ఉంటుంది. ఉదాహరణ: ఆవాలు, మిరప, వంగ.
గుబురు వేరు వ్యవస్థలో అనేక గుబురు వేళ్ళు కాండం దిగున భాగం నుంచి ఏర్పడి నేలలోకి, పక్కకి పెరుగుతాయి. ఈ వ్యవస్థ ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు వరి, గోధుమ, గడ్డి మొక్కలు.
మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడనూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే. పద్మ పురాణము ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.
↑Haeckel G (1866). Generale Morphologie der Organismen. Berlin: Verlag von Georg Reimer. pp. vol.1: i–xxxii, 1–574, pls I–II, vol. 2: i–clx, 1–462, pls I–VIII.