మేయర్

నగర పాలక సంస్థలకు, పట్టణ పురపాలక సంఘాలకు ఎన్నికలు ముగిసిన తదుపరి, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ లేదా నగర మేయర్ అంటారు. అలాగే మరొకరిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని డిప్యూటీ మేయర్ అంటారు. మొదటి గ్రేడు హైదరాబాద్ , విశాఖపట్నం (గ్రేటరు హోదా కలిగిన) లాంటి నగరపాలక సంస్థకు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలక అధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు.[1]

అనేక దేశాల్లో, నగరం లేదా పట్టణం వంటి పురపాలక సంఘ ప్రభుత్వంలో మేయర్ అత్యున్నత స్థాయి అధికారి. ప్రపంచవ్యాప్తంగా, మేయర్ అధికారాలు, బాధ్యతలకు సంబంధించి స్థానిక చట్టాలు, పద్దతులలో విస్తృత వ్యత్యాసాలు ఉన్నాయి. ఎంచుకున్న వ్యవస్థపై ఆధారపడి, మేయర్ మునిసిపల్ ప్రభుత్వం ముఖ్య కార్యనిర్వాహక అధికారి కావచ్చు, తక్కువ లేదా స్వతంత్ర శక్తి లేని బహుళ-సభ్య పాలకమండలికి అధ్యక్షత వహించవచ్చు, లేదా పూర్తిగా ఉత్సవ పాత్రను పోషించవచ్చు. మేయర్ విధులు, బాధ్యతలు పురపాలస సంఘ మేనేజర్లు, ఉద్యోగులను నియమించడం, పర్యవేక్షించడం, నియోజకవర్గాలకు ప్రాథమిక ప్రభుత్వ సేవలను అందించడం, మునిసిపల్ పాలక మండలి (లేదా రాష్ట్ర, ప్రాదేశిక లేదా జాతీయ పాలకమండలిచే తప్పనిసరి) ఆమోదించిన చట్టాలు, శాసనాలను అమలు చేయడం. మేయర్‌ని ఎంపిక చేసుకునే ఎంపికలలో ప్రజలచే ప్రత్యక్ష ఎన్నిక లేదా ఎన్నికైన పాలక మండలి లేదా బోర్డు ద్వారా ఎంపిక ఉంటుంది.

మేయర్ అనే పదం మిలిటరీ ర్యాంక్ ఆఫ్ మేజర్‌తో భాషా మూలాన్ని పంచుకుంటుంది, రెండూ చివరికి ఫ్రెంచ్ మేజర్ నుండి ఉద్భవించాయి.

మేయర్ అధికారాలు, విధులు

మేయర్ ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటాడు.

  • కార్పోరేషన్ ప్రతి సమావేశంనకు అధ్యక్షత వహించే అధికారం ఉంది.
  • పదవిరీత్యా ప్రతి స్థాయీ సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తాడు.
  • కార్పోరేషన్ ఎన్నికల జరిగిన తరువాత జరిగే మొదటి సమావేశం మినహా మిగిలిన అన్ని సమావేశంలకు సమయం,తేది,రోజు అటువంటి అంశాలను నిర్ణయించే అధికారం మేయరుకు ఉంది.
  • సభలో చర్చకు వచ్చు విషయాలకు (అజండా) మేయరు అంగీకారం ఉండాలి.
  • సమావేశాలను నియంత్రించే అధికారం ఉంది.
  • సమావేశాలలో సభ్యుడు ప్రవర్తన పూర్తిగా క్రమరహితంగా ఉన్నదని భావించిన పక్షంలో,వెంటనే ఆ సభ్యుడును కార్పోరేషన్ సమావేశం నుండి బయటకు వెళ్లమని సూచించవచ్చు.
  • ఎవరరైనా సభ్యుడు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆ విధంగా సమావేశం నుండి బహిష్కరించబడితే,ఆ సభ్యుడిని 15 రోజుల వ్యవధికి మించకుండా కార్పోరేషన్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేయవచ్చు.
  • సస్పెండ్ చేయబడిన సభ్యుడు అందుకు తగిన క్షమాపణ కోరుతూ పత్రం సమర్పించిన పక్షంలో, మేయర్ సంతృప్తి చెందినట్లయితే, సస్పెండ్ చేసిన కాలవ్యవధిని తగ్గించే అధికారం మేయరుకు ఉంది.
  • సమావేశాలలో తీవ్రమైన క్రమరాహిత్యం ఏర్పడిన సందర్బంలో మేయర్ సమావేశాన్ని మూడు రోజులకు మించకుండా నిలుపుదల చేయవచ్చు.
  • ఒక కార్పోరేషన్ సభ్యునిగా మేయర్ అన్ని హక్కులు కలిగి ఉంటాడు.కార్పోరేషన్ సభ్యునిగా విశిష్టమైన ప్రత్యేక హక్కులు కలిగి ఉండి, కార్పోరేషన్ సమావేశాలన్నింటిలోనూ ఓటు వేసే అర్హతను కలిగి ఉంటాడు.
  • బడ్జెట్ లభ్యతనుబట్టి,మేయర్ 50,000/- వరకు అత్యవసరమైన పనుల నిమిత్తం గ్రాంటు మంజూరు చేయవచ్చును.
  • కార్పోరేషన్ కార్యాలయ సిబ్బంది అనగా ఇంటర్నల్ స్టాపు బదిలీల విషయంలో కమీషనరు, మేయరును సంప్రదించాలి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "ఎన్నికైన పురపాలక సంఘం ప్రతినిధుల శిక్షణా కరదీపిక| (1.13.1 (పేజి సంఖ్య.42" (PDF). Archived from the original (PDF) on 2021-04-21. Retrieved 2019-02-23.

వెలుపలి లంకెలు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!