మూడు పువ్వులు ఆరు కాయలు (2018 సినిమా)

మూడు పువ్వులు ఆరు కాయలు
దర్శకత్వంరామ‌స్వామి
నిర్మాతవెంక‌ట్రావు
తారాగణందినేష్
అర్జున్ య‌జ‌త్‌
సౌమ్య వేణుగోపాల్‌
నిర్మాణ
సంస్థ
స్మైల్ పిక్చ‌ర్స్
విడుదల తేదీ
12 అక్టోబరు 2018 (2018-10-12)
దేశం భారతదేశం
భాషతెలుగు

మూడు పువ్వులు ఆరు కాయలు 2018లో విడుదలైన తెలుగు సినిమా.[1] డాక్టర్‌ మల్లె శ్రీనివాస్‌ సమర్పణలో స్మైల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్రావు నిర్మించిన ఈ సినిమాకు రామ‌స్వామి దర్శకత్వం వహించాడు.[2] దినేష్, అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 అక్టోబరు 12న విడుదలైంది.

కథ

అర్జున్ (అర్జున్ యాగిత్), భరత్ (నాగరాజు), రామస్వామి (కర్పూరం) ముగ్గురు రూమ్మేట్స్. అర్జున్ పోలీస్ 'ఎస్.ఐ’ కావాలని, కర్పూరం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నాగరాజు హారిక (పావని) ప్రేమలో పడి తన జీవితంలో ముఖ్యమైనవి కోల్పోతాడు. ఈ ముగ్గురు తమ జీవిత ఆశయాలను సాధించుకున్నే క్రమంలో వారికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు వచ్చాయి ? వాట్ని వాళ్ళు ఎలా ఎదురుకున్నారు ? వాళ్ళు అనుకున్నది సాధించారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

  • అర్జున్‌ యజత్‌
  • సౌమ్య వేణుగోపాల్‌
  • తనికెళ్ళ భరణి
  • కృష్ణ భగవాన్
  • పృథ్వీ
  • అజయ్ ఘోష్
  • భరత్‌ బండారు
  • పావని
  • రామస్వామి
  • సీమా చౌదరి
  • బాలాజీ
  • రాకెట్ రాఘవ
  • జబర్దస్త్ రాంప్రసాద్
  • జబర్దస్త్ అప్పారావు
  • జబర్దస్త్ మహేష్
  • జయలక్ష్మి
  • ప్రమోదిని

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: స్మైల్ పిక్చ‌ర్స్
  • నిర్మాత: వబ్బిన వెంకట్రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ‌స్వామి
  • సంగీతం: కృష్ణ సాయి
  • సినిమాటోగ్రఫీ: ఎం.మోహన్ చాంద్
  • పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల
  • ఆర్ట్ డైరెక్టర్: కె.వి.రమణ

మూలాలు

  1. Vaartha (8 October 2018). "మూడు పువ్వులు ఆరు కాయలు." Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  2. Sakshi (15 October 2018). "అది మా అదృష్టం". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  3. HMTV (15 October 2018). "మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా రివ్యూ". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!