ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలలో ముస్లీం వ్యతిరేకతా భావం ఉందన్న అపోహను తొలగించుటకు ఈ సంస్థ స్థాపించబడింది. గోవధను నిషేధించడంతో సహా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించిన అనేక ప్రతిపాదనలకు ఎం ఆర్ ఎం మద్దతు ప్రకటించింది.[1] దీని జాతీయ కన్వీనర్ మొహమ్మద్ అఫ్జల్, గోద్రా రైలు దహనం, 2002 గుజరాత్ అల్లర్ల రోజులలో సంస్థ గణనీయమైన ప్రతిఘటనలను ఎదుర్కొందని పేర్కొన్నాడు.[1]
వందేమాతరం
2009 నవంబరులో భారతదేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సంస్థలలో ఒకటైన జమియత్ ఉలేమా-ఇ-హింద్ వందేమాతరాన్ని ఇస్లామికేతర గేయంగా వర్ణిస్తూ ఒక తీర్మానాన్ని ఇచ్చింది. ఎం ఆర్ ఎం ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అఫ్జల్ "వందేమాతరం దేశ జాతీయ గేయం కనుక మన ముస్లిం సోదరులు ఫత్వాను అనుసరించరాదు. ప్రతి భారతీయ పౌరుడు వందేమాతరాన్ని గౌరవించి, పఠించాలి" అని పేర్కొన్నాడు. వందేమాతరాన్ని పాడటానికి నిరాకరించిన ముస్లింలు ఇస్లాం, భారతదేశం రెండింటికి వ్యతిరేకులు అని ఎం ఆర్ ఎం మరింత బలంగా చెప్పింది.[2][3]
అమర్నాథ్ భూ కేటాయింపు
2008 ఆగస్టులో ఎంఆర్ఎం, అమర్ నాథ్ తీర్థయాత్ర భూ కేటాయింపుకు మద్దతుగా ఢిల్లీలోని ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు ప్రయాణించి పైఘం-ఇ-అమన్ యాత్ర (శాంతి సందేశ యాత్ర)ను నిర్వహించింది. జార్ఖండ్ షాహీ-ఇమామ్ మౌలానా హిజ్బ్ రెహ్మాన్ మెర్తి నేతృత్వంలో, యాత్రలోని 50 మంది కార్యకర్తలు మొదట జమ్మూ & కాశ్మీర్ సరిహద్దులో నిలిపివేయబడ్డారు. తర్వాత వారికి జమ్మూ వెళ్ళడానికి అనుమతి లభించింది. అక్కడ వారు శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి అనే పేరుతో సమావేశాలు నిర్వహించారు.[4][5][6]
ఉగ్రవాద వ్యతిరేకత
నవంబరు2009లో ఎంఆర్ఎం, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర వెయ్యి మంది వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేసింది. ఈ వాలంటీర్లు వారి సొంత జిల్లాల్లో దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని కూడా తెలియజేశారు.[6]
2015లో ముస్లిం రాష్ట్రీయ మంచ్, విశ్వవ్యాప్తంగా విస్తరించిన యోగా అనే అంశంపై "యోగా , ఇస్లాం" అనే పుస్తకాన్ని ప్రచురించింది. 'యోగా'కి మతంతో ఎలాంటి సంబంధం లేదని MRM తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. "నమాజ్ అనేది ఒక రకమైన యోగా ఆసనం" అని పేర్కొంది. దీనికి ప్రకృతివైద్య మంత్రిత్వ శాఖ, యునాని, సిద్ధ హోమియోపతి (ఆయుష్) వంటి సంస్థలు మద్దతునిచ్చాయి.[8]