ముక్కామల కృష్ణమూర్తి |
---|
|
జననం | ముక్కామల కృష్ణమూర్తి (1920-02-28)1920 ఫిబ్రవరి 28
|
---|
మరణం | 1987 జనవరి 10(1987-01-10) (వయసు 66) |
---|
ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 - జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు.
జననం - కుటుంబం
ఈయన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. తల్లిదండ్రులు భార్య భారతి. కుమారుడు సుబ్బారావు. ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ.
సినీరంగం
ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్.శర్మ ఎన్టీఆర్, జగ్గయ్య లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్, నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ' మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా సినీ నటన ప్రారంభించారు. 'లైలా మజ్ను'లో భానుమతి తండ్రిగా నటించారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'మరదలుపెళ్ళీ,'ఋష్యశృంగ' చిత్రాలకు దర్శకత్వం వహించారు.కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్ వేయడం ముక్కామల హాబీలు.
చిత్ర సమాహారం
నటుడిగా
దర్శకునిగా
మరణం
ఈయన 1987లో మరణించారు.
మూలాలు
బయటి లింకులు