1996 లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు.
సాహిత్యంలో వీరు చేసిన కృషికి 2002లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డు ను అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి సెమినార్లలో పాల్గొన్నారు. 40కి పైగా అవార్డులను అందుకున్నారు. వీరి కవితలకు,కథలకు బహుమతులు కూడా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు,కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.
భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక తెలుగు వచన కవిత్వంలో *మొగ్గలు* అనే కవితా ప్రక్రియ 2017లో ప్రారంభించాడు. ఇది మూడు పాదాల కవిత్వం.మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే మూడవ పాదం దానిని సమర్థించేదిగా ఉంటుంది. ఇప్పటివరకు 42 మొగ్గల కవితా సంపుటాలు వెలువడ్డాయి.
మూలాలు
↑పాలమూరు కవిత,సంపాదకులు:భీంపల్లి శ్రీకాంత్,పాలమూరు సాహితి, మహబూబ్ నగర్,జనవరి-2004,పేజి-160