లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.[3]
జిల్లాలోని విద్యా సంస్థలు
జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.