శ్రీదేవి ( శాలిని ) కిరణ్మయి ( జయసుధ ) కుమార్తె. కిరణ్మయికి పిచ్చి. తన తండ్రి ఎవరో తెలియదని శ్రీదేవిని అందరూ ఎగతాళి చేస్తారు. ఆమె గర్భధారణకు కారణమైన వ్యక్తిని చూసినప్పుడే ఆమె తల్లికి పిచ్చి కుదిరి మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు. తన తండ్రి కోసం వెతుకుతున్న ప్రక్రియలో, శ్రీదేవి శక్తి ( వెంకటేష్ ) ని కలుస్తుంది. ఇతరులకు సహాయం చేయాలని ఎప్పుడూ అనుకునే దయగల పెద్దమనిషి అతడు. ఆమె కథ విన్న తరువాత, అతను ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. శక్తి కూడా శ్రీదేవి లాంటి వ్యక్తే: శక్తి చిన్నతనంలో, అతని తండ్రి చేసిన మోసం కారణంగా అతని తల్లి జైలు పాలైంది. అతనికి ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. అమ్మడు ( రజని ), శక్తి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. శ్రీదేవి తండ్రిని కనుగొనడంలో శక్తి విజయం సాధిస్తాడా? అతను తన తల్లిని కలవగలడా? అనేది మిగతా కథ