బండి పార్థసారథిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు, రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది.[1]
జననం, విద్యాభాస్యం
బండి పార్థసారథి 1965లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, కందుకూరు గ్రామంలో జన్మించాడు. ఆయన సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తరువాత పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[2]
వృత్తి జీవితం
బండి పార్థసారథి డిగ్రీ పూర్తయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే హెటిరో సంస్థను స్థాపించి దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించి ఆ సంస్థను నిలబెట్టారు. విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగానూ ఎదిగాడు.[3]
రాజకీయ జీవితం
బండి పార్థసారథి వైద్యం, విద్య రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2019లో టీటీడీ ధర్మకర్తలి మండలి సభ్యుడిగా నియమితుడై, ఆ తరువాత 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది.[4][5][6]
మూలాలు