పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు
పుట్టిన తేదీ, స్థలంజూన్ 24, 1915
తిరుపతిపురం, అత్తిలి మండలం పశ్చిమ గోదావరి జిల్లా
మరణంఫిబ్రవరి 17, 1983
కలం పేరుపాలగుమ్మి
వృత్తిలెక్చరర్
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
విద్యM.Sc.
పూర్వవిద్యార్థికాశీ విశ్వనాథం
రచనా రంగంకవి, రచయిత
గుర్తింపునిచ్చిన రచనలుగాలివాన కథ
పురస్కారాలుసాహిత్య అకాడమీఅవార్డు
బంధువులుపాలగుమ్మి విశ్వనాథం

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.

నేపథ్యం

పద్మరాజు జూన్ 24, 1915పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు.

సాహిత్య జీవితం

తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు, నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది. పాలగుమ్మి రచించిన నవలలో

  • బతికిన కాలేజి,
  • నల్లరేగడి,
  • రామరాజ్యానికి రహదారి,
  • రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ముఖ్యమైనవి.

సినీరంగ రచయితగా

1954లో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, వాహినీ ప్రొడక్షన్స్ పతాకము కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరాడు. దీనితో మొదలుపెట్టి, పద్మరాజు సినీ రంగములో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చాడు. ఈయన భక్త శబరి, బంగారు పంజరం వంటి అనేక సినిమాలలో పనిచేశాడు. ఈయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా వ్యాపారపరంగా విజయవంతము కాలేదు.

దర్శకుడిగా బికారి రాముడు అనే చిత్రం తీశారు కానీ చిత్రం విజయవంతం కాలేదు. ఈయన నవల నల్లరేగడిని కృష్ణ కథానాయకుడుగా 'మన (మా) వూరి కథ' పేరుతో సినిమా తీశారు. పడవ ప్రయాణం కథను స్త్రీ' పేరుతో చిత్రంగా నిర్మించారు (పా.ప. మరణానంతరం). రోహిణి కథానాయికగా నటించిన చిత్రం వ్యాపార పరంగా విడుదల కాలేదు.

ఈయన అనేక దాసరి నారాయణరావు సినిమాలకు ఘోష్టు రైటరుగా పనిచేశాడని వినికిడి.[1]

పాలగుమ్మి వారి గాలివాన కథకు వెనుక వున్న ఓ వాస్తవ కథ

ఆ రోజుల్లో శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య, శ్రీ నండూరి రామకృష్ణమాచార్యలు మొదలగు వారికి తమ కాలేజీలో వుద్వోగాలిచ్చి వాళ్లెవరు కాలేజి వదలి వెళ్లి పోకుండా వుండటానికి, చిన్న చిన్న ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కట్టు కొమ్మని కాలేజి అధికారులు అన్నారు. నండూరి వారింటి ప్రక్కనే పాలగుమ్మి వారు ఇల్లు కట్టుకున్నారు . అయితే చేతిలో అంతగా డబ్బు లేక పోవడం వల్ల పక్కా ఇల్లు నిర్మిచుకోలేదు, పాల గుమ్మి వారు. నాలుగైదు ఆడుగుల ఇటుక గోడ పైనా తాటాకుల పాక., ఆపాకనే గది, హాలు, వంటిల్లుగా విబజించు కున్నారు.

ఇలా వుండగా ఓ అర్థ రాత్రి భయంకరమైన గాలి వాన వచ్చింది. ఇళ్ల పైకప్పులు ఎగిరి పోతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం కూలి పోతున్నాయి. కరెంటు లేదు. ఇంటి పైకప్పు మీద తాటాకులు ఎగిరి పోతున్నాయి. ఇటుక గోడలు కూడా వూగి పోతున్నది. . ఇంట్లో ప్రమాదమని పద్మరాజు గారు భార్యని హెచ్చరించి బయటికి వెళ్లి పోదాం అన్నారు. ఇద్దరు బయలు దేరారు. ఆయన బైట పడ్డారు. ఆమె మాత్రం అక్కడ చిక్కుక పోయారు. ఇంతలో ఇటుకల గోడలు, ఇంటి పైకప్పు మొత్తం అంతా పెళ పెళ మంటూ కూలి పోయింది. ఆశిథిలాల క్రింద అమె ఇరుక్కు పోయారు. పద్మ రజుగారి గుండెల్లో పిడుగు పాటు. కొడలా పడి వున్న ఆ శిథిలాల క్రింద తన భార్య ఏమయిందో.... ఆశిథిలాలను తియ్యడం తన ఒక్కడి వల్లనేమౌతుంది. చుట్టు చీకటి, భయంకరమైన తుపాను ఎవ్వరు కని పించ లేదు. తనొక్కడే నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. భార్యబతికి వుండా ప్ ఈ పాటికి చనిపోయిందా... ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో స్థాణువుఇలా నిలబడి పోయాడ్రు పద్మారాజుగారు. ఈలోగా పేళ పెళ మనిశబ్దం విని అటు చూసారు. చేతిలో టార్చి లైటు పుచ్చుకుని హాస్టలు లోని విద్యార్థులు, తోటి లెక్చరర్లు పరుగెత్తుకొని వచ్చారు వచ్చి చూస్తే ఏముంది. స్తాణువులా నిలబడి వున్న పద్మరాజు. కొండలా పడి వున్న ఇంటి శిథిలాలు. ఎమయిందో అర్థమైంది అందరికి. ఓ గంట అయ్యే సరికల్లా ఆ ఇటుకలు, ఆకులు తీసి పద్మ రాజు గారి భార్య శరీరాన్ని బయటకు తీసారు. తీసారు గాని అమె బ్రతికి వుందో లేదో తెల్లవారితే గాని తెలియదు.

ఈ లోగా ఆయన పొందిన అవెదనా, పడిన ఆందోళనా, గుండెని, మనసుని కలచి వేసిన ఆ అనుభవము చాల భయంకరమైనది, తీవ్రమైనది..... బలమైనదీను.....

అంత బలమైన అనుభూతిలోంచి వచ్చింది గనుకే గాలి వాన కథ అంత గొప్పగా రూపు దిద్దుకుంది. పద్మరాజు 1983లో మరణించాడు.

మూలాలు

  1. "తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష". Archived from the original on 2009-04-03. Retrieved 2007-10-29.
  2. "CineGoer.com - Nostalgia - Sardar Paparayudu". Archived from the original on 2012-09-27. Retrieved 2015-05-25.

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!