పల్లా రాజేశ్వర్ రెడ్డి
|
|
|
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
|
ముందు
|
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
|
నియోజకవర్గం
|
జనగామ
|
ఎమ్మెల్సీ
|
ప్రస్తుత పదవిలో
|
అధికార కాలం 30 మార్చి 2021 – 9 డిసెంబర్ 2023[1]
|
నియోజకవర్గం
|
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం
|
వ్యక్తిగత వివరాలు
|
|
జననం
|
నవంబరు 4, 1963 సోదేశపల్లి గ్రామం, వరంగల్ జిల్లా
|
జాతీయత
|
భారతీయుడు
|
రాజకీయ పార్టీ
|
భారత్ రాష్ట్ర సమితి
|
జీవిత భాగస్వామి
|
సూర్యదేవర నీలిమ
|
సంతానం
|
అనురాగ్
|
నివాసం
|
H.No 8-2-293/82/NG/32, నందగిరి హిల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్
|
మతం
|
హిందూ
|
పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి 2015, 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందాడు. ఆయన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో ఉన్నాడు.[2][3]
జననం
పల్లా రాజేశ్వర్ రెడ్డి 1963, నవంబరు 4వ తేదీన వరంగల్ జిల్లా, సోదేశపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పల్లా రాఘవ రెడ్డి, తల్లి అనసూయ. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూర్యదేవర నీలిమతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు.
విద్యాభాస్యం
పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవ తరగతి వరకు హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, మల్లికుదుర్ల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఫిజిక్స్ లో పి.హెచ్.డి పట్టా పొందాడు.[4]
రాజకీయ జీవితం
పల్లా రాజేశ్వర్ రెడ్డి 1985-87 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శిగా పనిచేశాడు. 1988 నుండి 91 వరకు ఎస్.ఎఫ్.ఐ. హైదరాబాద్ నగర కార్యదర్శిగా పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2015లో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనమండలికి (ఎమ్మెల్సీ) ఎన్నికయ్యాడు. ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[5] అనంతరం 2016 - 2019 వరకు ప్రభుత్వ విప్ గా ఉన్నాడు.ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[6] 2019లో అయన రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు.[7] 2021, మార్చిలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా గెలుపొందాడు.[8][9] ఆయన 2021 సెప్టెంబరు 16న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[10]
ఆయన 2023 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 15,783 ఓట్ల మెజార్టీతో [11][12], డిసెంబరు 14న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13]
మూలాలు