నల్లమల (ఆంగ్లం : The Nallamala) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.[1]. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.[2]. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
భూగర్భ శాస్త్రము
నల్లమల శ్రేణులలోని రాళ్ళు కడప జిల్లాలో దాదాపు 20,000 2222 2 ss2z6z6xcx6zc ani chepe adugulo అడుగుల మందాన్ని కలిగివున్నవి.[3]. ఈ రాళ్ళలో ప్రాథమికమైనది క్వార్‌జైట్, ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో ఉంది. సాండ్ స్టోన్ కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.[2]
వాతావరణం
ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని, వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి.
భౌగోళికం, నేల ఉపయోగం
ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది.[4].
మానవ జీవనం
నీటికొరత కారణంగా జనజీవనం అత్యల్పం. ఈ ప్రాంతంలో నగరాలు పట్టణాలు వెలవక పోవడానికి కారణం ఇదే. ఈ ప్రాంతంలో నంద్యాలపట్టణం పెద్దది.
ఈ ప్రాంతంలో అటవిక తెగలు : చెంచులు నివసిస్తున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరపు అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.[5]
ప్రధాన సంఘటనలు
గతంలో కొందరు శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
2004 లో నక్సలైట్లు ( మావోయిస్టులు ) ను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం.9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.[6] హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన పావురాలగుట్ట(చింతగుండం) ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.
ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనాన్ని నిర్మించినది ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము