ధూళికోట (ధూళికట్ట)

కోటిలింగాల తర్వాత తెలంగాణలోని అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతం ధూళికోట ధూళికట్ట. ఈ స్థావరం ఎలిగేడు మండలంలోని హుస్సేనిమియా వాగు ఒడ్డున ఉంది. ఇది శాతవాహనులు, వారి పూర్వీకుల నాటిది. శాతవాహనుల కాలంలో కోటలను కటకములు అని పిలిచేవారు. ఈ లెక్కన ఇది మొదట ధూళి కటకంగా ఉండి, క్రమంగా ధూళికోట, ధూళికట్టగా మారిందని చరిత్రకారులు నిర్ధారించారు.[1]

ధూళికోట శిశేషం

ధూళికోట అనగా మట్టికోట అని అర్థం. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రుల 30 దుర్గాల్లో కోటిలింగాల ఒకటి కాగా, మరొకటి ధూళికట్ట అని తెలుస్తోంది. ఇక్కడ తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి, భూమి కంటే 6 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ 3 నుంచి 5 మీటర్ల ఎత్తున మట్టి ప్రాకారముంది. గోడల చుట్టూ కందకాలున్నాయి.కోటకు నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. దక్షిణ ద్వారానికిరువైపులా భటుల గదులున్నాయి. ఈ ద్వారానికి ఉత్తరాన కొన్ని రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు బయటపడ్డాయి. ఈ భవనాల అరుగులను ఇటుకలతో నిర్మించారు. ప్రవేశ ద్వారాల మెట్లనూ ఇటుకలతోనే కట్టారు.

పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఇక్కడ బౌద్ధస్థూపం బయటపడింది - ప్రతీకాత్మక చిత్రం

తవ్వకాలు

1975లో తవ్వకాల్లో మాతృదేవతా విగ్రహం(టెపూరకొట్ట ప్రతిమ), అనేక పంచ్‌మార్‌‌కడ్‌ నాణేలు, ఇనుప మొలలు, బాణపు మొనలు, బల్లెపు మొనలు, మృణ్మయ పాత్రలు, రాగి, ఇనుప, దంతపు, టెరక్రొట్ట వస్తువులు, పూసలు, గాజులు, వేలి ఉంగరాలు లభ్యమయ్యాయి.

బౌద్ధస్తూపం

పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 1975లో జరిగిన తవ్వకాల్లో అతి ప్రాచీన (హీనాయాన శాఖకు చెందిన) బౌద్ధస్తూపం బయటపడింది. ఇది విదర్భ దక్షిణ కోసల, ఆంధ్రపథం రాజమార్గంపై ఉంది. దూళికట్ట కోటకు ఉత్తరాన కేవలం కిలోమీటరు దూరంలో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ స్తూప గర్భం 47 శిలాపలకలతో అతికి ఉంది. ఇవి సున్నపురాతి పలకలు. వీటి మీద ఐదు పడగల ముచిలింద నాగు, బోధి వౄఎక్షం, మహాభినిష్క్రమణ, బుద్ధపాదం చెక్కి ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కరీంనగర్‌ మ్యూజియంలో భద్రపరిచారు. ముచిలింద నాగును కాలచక్ర ఉత్సవాల కోసం అమరావతి తరలించారు. ఈ స్తూపంపై బ్రాహ్మీలిపిలో దాతల పేర్లు చెక్కి ఉన్నాయి.

పెద్దబొంకూర్‌

మరోవైపు ఇదే హుస్సేనిమియా వాగు తీరంలోని పెద్దబొంకూర్‌(కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి వెళ్లే దారిలో)లో శాతవాహనుల గ్రామం బయటపడింది. ఇక్కడ పలు ఇటుక కట్టడాలు, బావులు, నీటి తొట్లు, మురికి నీటి ఇంకుడు గుంతలు వెలుగుచూశాయి. అనేక పంచ్‌మార్‌‌కడ్‌ నాణేలు, ఇనుప, రాగి, టెరక్రొట్ట వస్తువులు, పూసలు, గాజులు, వెండి చెవి ఆభరణాలు, గజలక్ష్మి టెరక్రొట్ట ముద్రిక లభ్యమయ్యాయి. ఇవిగాక, కోటిలింగాలకు సమీపాన పాషిగాంవ్‌లో ఇటుకలతో నిర్మించిన చైత్యగౄఎహం, పాలరాతి స్తూపం బయల్పడ్డాయి. శ్రీరాంపూర్‌ మండలం పోచంపల్లిలో బుద్ధుని అస్థికలు దాచిన భరిణెగల చిన్న బౌద్ధ స్తూపం బయటపడింది. అలాగే ఓదెల మండలం మీర్జంపేటలోనూ క్రీ.పూ.2వ శతాబ్దం నాటి బౌద్ధస్తూపాలు బయటపడ్డాయి. ఇలా పురావస్తు తవ్వకాల్లో వెలుగుచూసిన అనేక స్థావరాలు, కోటిలింగాల కేంద్రంగా వర్ధిల్లిన ఆంధ్ర, శాతవాహన సామ్రాజ్య వైభవాన్ని కళ్ల గడుతున్నాయి.

కనుమరుగవుతున్న చరిత్ర

క్రీ.పూ.4వ శతాబ్దం నాటి శాతవాహనుల కట్టడాలకు పరిరక్షణ లేకుండా పోయింది. పురావస్తు అధికారులు పట్టించుకోకపోవడంతో గత కాలపు చిహ్నాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే ధూళికట్ట బౌద్ధస్తూపం శిథిలావస్థకు చేరుకోగా, పలకలు దొంగల పాలయ్యాయి. పెద్దబొంకూర్‌ స్థావరం కంప చెట్ల మధ్య కూరుకుపోయింది. చరిత్ర విద్యార్థులు, ఔత్సాహికులు వెళ్లి చూద్దామన్నా కనీస దారి కరువైంది. మోకాళ్ల లోతు నీళ్లలోంచి హుస్సేనిమియా వాగు దాటాల్సి వస్తోంది. వరద వస్తే అంతే సంగతులు!

ఇవికూడా చూడండి

మూలాలు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!