దొరసాని 2019, జూలై 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్త నిర్మాణంలో కేవీఆర్ మహేంద్ర[1] తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్నకుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2]
కథ
నక్సలైట్ శివన్న (కిషోర్) 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తాడు. రాగానే రాజు అనే తన స్నేహితుడి కోసం అతడి ఊరికి వెళ్తాడు. రాజు గురించి అక్కడి వాళ్లను అడిగి.. అతడి కథను గుర్తు చేసుకుంటాడు. రాజు (ఆనంద్ దేవరకొండ) తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆ ఊరి దొర కూతురు చిన్న దొరసాని (శివాత్మిక)ని రాజు ఇష్టపడతాడు. దొరసాని కూడా రాజును ఇష్టపడుతుంది. విషయం తెలిసి ఆమె తండ్రి రాజును చంపించాలనుకుంటాడు. కొన్నేళ్ల పాటు అతన్ని చెరసాలలో బంధిస్తారు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే కథ.[3]
నటవర్గం
సాంకేతికవర్గం
పాటలు
- నింగిలోన పాలపుంత నవ్వులొంపినే, నేలపైన పాలపిట్ట తొవ్వగాసినే.. (గానం: అనురాగ్ కులకర్ణి, రచన: గోరటి వెంకన్న)
- కప్పతల్లి.. కప్పతల్లి (గానం: అనురాగ్ కులకర్ణి, రచన: గోరటి వెంకన్న)
- కలలో కలవరమై వరమై (గానం: చిన్మయి శ్రీపాద, రచన: శ్రేష్ట)
ఇతర వివరాలు
- దర్శకుడిగా కేవీఆర్ మహేంద్రకు, హీరో హీరోయిన్లుగా అనంద్ దేవరకొండ, శివాత్మిక లకు ఇది తొలిచిత్రం.
- దర్శకుడు కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకోసం 42 వెర్షన్స్ రాశాడు.[4][5]
పురస్కారాలు
సైమా అవార్డులు
2019 సైమా అవార్డులు
- సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (శివాత్మిక)
మూలాలు
ఇతర లంకెలు