టి.ఆర్. జెలియాంగ్
|
|
|
అధికారంలో ఉన్న వ్యక్తి
|
అధికార ప్రారంభం 7 మార్చ్ 2023
|
గవర్నరు
|
లా గణేశన్
|
ముందు
|
ఐ.కె. సెమా (1989)
|
|
పదవీ కాలం 19 జులై 2017 – 8 మార్చి 2018
|
గవర్నరు
|
పద్మనాభ ఆచార్య
|
ముందు
|
షుర్హోజెలీ లీజీట్సు
|
తరువాత
|
నెయిఫియు రియో
|
పదవీ కాలం 24 మే 2014 – 20 ఫిబ్రవరి 2017
|
గవర్నరు
|
- అశ్వని కుమార్
- క్రిషన్ కాంత్ పాల్
- పద్మనాభ ఆచార్య
|
ముందు
|
నెయిఫియు రియో
|
తరువాత
|
షుర్హోజెలీ లీజీట్సు
|
నాగాలాండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
|
పదవీ కాలం 15 మార్చి 2018 – 7 మే 2022
|
తరువాత
|
ఖాళీ
|
ఎమ్మెల్యే
|
ప్రస్తుత పదవిలో
|
అధికార కాలం 2008
|
ముందు
|
వత్సు మేరు
|
నియోజకవర్గం
|
పెరెన్
|
వ్యక్తిగత వివరాలు
|
|
జననం
|
(1952-02-21) 1952 ఫిబ్రవరి 21 (వయసు 72) మ్బౌపుంగ్వా, అస్సాం , భారతదేశం (ప్రస్తుతం నాగాలాండ్ , భారతదేశం )
|
రాజకీయ పార్టీ
|
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
|
ఇతర రాజకీయ పార్టీలు
|
నాగా పీపుల్స్ ఫ్రంట్
|
జీవిత భాగస్వామి
|
కెవిజేనువో రంగ్‌కౌ
|
నివాసం
|
రంగకౌ మాన్షన్, దిమాపూర్, నాగాలాండ్
|
తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్ (జననం 1952 ఫిబ్రవరి 21) నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు టెన్నింగ్ & పెరెన్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2017 నుండి 2018 వరకు 10వ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేసి[1] ప్రస్తుతం నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు.
రాజకీయ జీవితం
జెలియాంగ్ 1982 & 1987 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో టెన్నింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 1989 ఎన్నికలలో నాగా పీపుల్స్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1993, 1998, 2003లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు టెన్నింగ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
జెలియాంగ్ 1989 నుండి 90 వరకు రాష్ట్ర సమాచార, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా, 1994 నుండి 1998 వరకు సహాయ & పునరావాస శాఖ సహాయ మంత్రిగా, 1998 నుండి 2003 వరకు పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు. అయన 2003లో నాగాలాండ్ కాంగ్రెస్‌ని స్థాపించి ఆ తరువాత దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) లో విలీనం చేసి 2004 నుండి 2008 వరకు నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికై తిరిగి 2008లో రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చి నెయిఫియు రియో మంత్రివర్గంలో ప్లానింగ్, జియాలజీ & మైనింగ్, పశుసంవర్ధక & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.
నాగాలాండ్ ముఖ్యమంత్రి
జెలియాంగ్ 2014 మే నుండి 2017 ఫిబ్రవరి వరకు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా[2], 2017 జూలై నుండి 2018 మార్చి వరకు రెండు పర్యాయాలు నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు[3]. ఆయన ఆ తరువాత నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు శాసనసభాపక్ష నేతగా, 2022 నుండి నాగాలాండ్ ప్రభుత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (నాగాలాండ్) చైర్మన్ నియమితుడయ్యాడు.
మూలాలు