గుల్జార్ |
---|
|
జననం | సంపూర్ణ సింగ్ కల్ర |
---|
వృత్తి | సినీ దర్శకుడు, గీత రచయిత, సంభాషణల రచయిత, సినీ నిర్మాత, కవి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1961 - వర్తమానం వరకు |
---|
జీవిత భాగస్వామి | రాఖీ |
---|
పిల్లలు | మేఘనా గుల్జార్ |
---|
చలనచిత్ర పాటల రచయిత గుల్జార్ 1936, ఆగష్టు 18 న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.[1]
గుల్జార్‌ను ఉర్దూ సాహిత్యానికి చేసిన కృషికిగాను 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.[2] అస్సాం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి గా వ్యవహరించాడు. [3]
సినీ గేయ రచయిత, దర్శకుడు
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి 1963 లో తొలి పాట రాశాడు. హృషీకేశ్ ముఖర్జీ 1968లో తీసిన ఆశీర్వాద్, 1971 లో 'గుడ్డి' , 1969 లో 'ఖామోషి' వంటి చిత్రాలకు లకు సాహిత్యం అందించాడు.
మీనా కుమారి మరణించిన తరువాత ఆమె వ్రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చు వేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత అమృతా ప్రీతమ్ రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ (హైకూ)రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన ఉర్దూ కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
ఉదారవాద కవి అయిన గుల్జార్ 1971లో 'మేరేఅప్నే' చిత్రం నుంచి దర్శకుడుగా మారాడు. లైకిన్, కోషిష్ (1971), పరిచయ్ (1971), ఆంధీ (1975), ఖుష్బూ (1975), మౌసమ్ (1975), లిబాస్ (1988) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇదికాకుండా 1958 లో జరిగిన ఒక నేర పరిశోధన ఆధారంగా 1973లో 'ఆచానక్' అనే సినిమాకు దర్శకత్వం చేసాడు. 1988లో నసీరుద్దీన్ షా నటించిన మీర్జా గాలిబ్ అను టెలివిజన్ ధారావాహికను, ప్రముఖ హిందీ రచయత ప్రేమ్ చంద్ జీవితం ఆధారంగా 'తహ్రీర్ మున్షి ప్రేమ్ చంద్ కి అను సీరియల్ ని, ఇంకా 'జంగల్ బుక్', 'హలొ జిందగీ', పోట్లీ బాబా'కి అను ధారావాహికలకు దర్శకత్వం వహించాడు. [3]
రాసినవి
- న్యూ ఢిల్లీ టైమ్స్ (1986)
గుర్తింపులు, అవార్డులు
వ్యక్తిగత జీవితం
గుల్జార్ నటి రాఖిని పెళ్ళి చేసుకుని విడిపోయాడు. కూతురు మేఘనా గుల్జార్ కూడా సినిమా డైరెక్టర్. దేశ విభజన కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చి ముందు ఢిల్లీలో గడిపినా తరువాత 1943 నుంచి ముంబయిలో స్థిరపడ్డాడు. అక్కడ ఒక గ్యారేజీలో పనిచేస్తుండగానే ప్రగతిశీల రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది.
మూలాలు
బయటి లింకులు