కీరవాణి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది 74 మేళకర్త రాగాల జాబితాలో 21 వ రాగం. [1] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో "కిరణవళి" గా పిలుస్తారు.
ఈ రాగం పాశ్చాత్య సంగీతంలో కూడా గుర్తింపు పొందింది. దీనిని సమానమైన రాగం పాశ్చాత్య సంగీతంలో హార్మోనిక్ మైనర్ స్కేల్.[2][3]ఇది కర్ణాటక సంగీతం నుండి హిందూస్థానీ సంగీతంలోకి అరువు తెచ్చుకున్నట్లు చెబుతారు.
రాగ లక్షణాలు
ఆరోహణ : స రి గ మ ప ధ ని స (S R2 G2 M1 P D1 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స (S N3 D1 P M1 G2 R2 S)
ఈ రాగం లోని స్వరాలుచతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం,
శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
చాలామంది వాగ్గేయకారులు కీరవాణి రాగంలో కీర్తనల్ని రచించారు.