కిల్లర్ సూప్ 2024లో హిందీలో విడుదలైన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్‌పై చేతనా కౌషిక్, హనీ ట్రెహాన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పేయ్, కొంకణా సేన్ శర్మ, సాయాజీ షిండే, నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ని జనవరి 3న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను జనవరి 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.[2][3]
కథ
ప్రభాకర్ శెట్టి(మనోజ్ భాజ్‌పాయి) తన భార్య స్వాతిని (కొంకణా శర్మ) భార్యాభర్తలు. స్వాతికి రెస్టారెంట్ పెట్టి తన వంట పాయా సూప్‌తో (ట్రాటర్ సూప్)తో అందరిని అంబురపరచాలనుకుంటుంది. ఈ విషయం భర్త ప్రభాకర్ చెప్పగా రెస్టారెంట్ తెరవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ప్రభాకర్‌కు ఉమేష్ పిళ్లైతో (మనోజ్ భాజ్‌పాయి ద్విపాత్రాభినయం) తన భార్య స్వాతి అక్రమ సంబంధం బయట పడుతుంది. ప్రభాకర్ తో పెళ్లికి ముందే ఉమేష్‌ను ప్రేమించిన స్వాతి పెళ్లి తర్వాత కూడా అతడితో సంబంధం కొనసాగిస్తుంది.
ఇది తెలిసిన ప్రభాకర్ భార్య స్వాతిని చంపాలనుకుంటాడు. కానీ, స్వాతి ఉమేష్‌తో కలిసి భర్త ప్రభాకర్‌ను చంపేస్తుంది. ఆ తర్వాత అచ్చం తన భర్త ప్రభాకర్ పోలికలతో ఉన్న ఉమేష్‌ను తన భర్తగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రభాకర్ హత్య బయట పడకుండ ఉమేషేని ప్రభాకర్ అని ప్రపంచాన్ని నమ్మించేందుకు స్వాతి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఎప్పుడూ ఏదోక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది. వాటిని దాటడానికి వారిద్దరు ఏం చేశారు ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]