ఒక గర్భవతియైన మహిళను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. మేరీ అనే నర్సు ఆమెకు బిడ్డను కనడంలో సహాయం చేస్తుంది. ఆ బిడ్డపేరు ఈశ్వర్. రౌడీలు ఈశ్వర్ తల్లిని కనుగొనేసరికి మేరీ ఈశ్వర్ ని తీసుకుని పారిపోతుంది. ఆ రౌడీలు ఈశ్వర్ తల్లిని చంపేస్తారు. మేరీ ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి తనకు అంతకు ముందే ఇరువురు సంతానం ఉన్నా అతని బాధ్యతను తలకెత్తుకుంటుంది. ఆమెకు తర్వాత నాన్సీ అనే ఆడపిల్ల పుడుతుంది. కొద్ది రోజులకు ఈశ్వర్ కి మేరీ తన సొంత తల్లి కాదని తెలుస్తుంది. మేరీ కూడా ఆర్థిక సమస్యల వల్ల అతని ఒక అనాథాశ్రమంలో చేరుస్తుంది. ఆ అనాథాశ్రమంలో అనేక కష్టాలు పడి మొరటివాడుగా తయారవుతాడు.
అసలు కథ
డబ్బు కోసం ఈశ్వర్ ఒక కిరాయి రౌడీగా మారతాడు. భూపతి అనే వ్యక్తి తన కొడుకు బెనర్జీ ద్వారా ఈశ్వర్ ని పిలిపించి పదిహేను రోజుల్లోగా మాళవిక ఒక మహిళ, చిన్న పాపను చంపేలా ఐదు లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కానీ అతని మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. దాంతో భూపతి అతను ఎంచుకున్న పని ఎంత కష్టమైనదో వివరించి కావాలంటే అడ్వాన్సు తిరిగిచ్చేసి తన ప్రయత్నం విరమించుకోమంటాడు. కానీ ఈశ్వర్ ఆ పని ఇంకా చాలెంజిగా తీసుకుంటాడు.