కిక్ (సినిమా)

కిక్
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేందర్ రెడ్డి
నిర్మాణం ఆర్.ఆర్.వెంకట్
కథ వక్కంతం వంశీ
చిత్రానువాదం సురేందర్ రెడ్డి
తారాగణం రవితేజ,
ఇలియానా,
జయప్రకాశ్ రెడ్డి
సాయాజీ షిండే,
ప్రభ,
బ్రహ్మానందం,
వేణుమాధవ్,
ఆలీ,
కోట శ్రీనివాసరావు,
బెనర్జీ,
దువ్వాసి మోహన్
సంగీతం ఎస్.ఎస్. తమన్
నృత్యాలు రాజు సుందరం, కళ్యాణ్, కృష్ణారెడ్డి
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం రసూల్ ఎల్లోర్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఆర్ ఆర్ మూవీ మేకర్స్
భాష తెలుగు

కిక్ రవితేజ కథానాయకుడిగా 2009 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇలియానా ఇందులో కథానాయిక.

కథ

మలేషియా నేపథ్యం లో కథ మొదలవుతుంది. నైనా (ఇలియానా) ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్ అయిన కళ్యాణ్ కృష్ణ (శ్యామ్-తొలిపరిచయం) పెళ్ళి చూపుల పేరుతో కలుస్తుంది. వారిద్దరికీ ఇంచుమించు సంబంధం కుదురుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకునేటప్పుడు అతని పేరులోని కళ్యాణ్ అనే పదాన్ని విని అతనికి తన గతాన్ని గురించి తెలియ జేస్తుంది. ఆమెకు పరిచయమైన కళ్యాణ్ గురించి చెబుతుంది. కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ కిక్ ఉండాలని కోరుకుంటుంటాడు. నిజానికి కళ్యాణ్ ఒక దొంగ. అయితే అతను ఎందుకు దొంగగా మారాడనే దాని వెనుక ఒక ఉదాత్తమైన సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాపకు ప్రాణాంతకమైన జబ్బు చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నించి ఆమెకు శస్త్రచికిత్స చేయించలేక, పాప చావును చూడలేమంటూ ఉత్తరం రాసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ సంఘటన కళ్ళారా చూసిన రవితేజ చలించిపోయి ఆ పాపను బ్రతికించడానికి తనకున్న ఆస్థులను తెగనమ్మి శస్త్రచికిత్స చేయిస్తాడు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆమె కళ్ళలో ఆనందం చూసి ఆమెలాంటి మరెందరో పిల్లలకు వైద్యం చేయించడానికి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అన్యాయాలు, అక్రమాలు చేసి కోట్లు గడించిన ప్రముఖుల ఇళ్ళలోనే చేస్తుంటాడు.

తారాగణం

పాటలు

  • దిల్ కలాసే , : అనుష్కమాంచంద్, కోరస్
  • ఐ డోంట్ వాంట్ లవ్, కార్తీక్ కోరస్
  • థింతననా , అటుచుడొద్దన్నా , చిత్ర , తమన్, రంజిత్ కోరస్
  • మనసే తడిసేలా , వర్దని, తమన్
  • గో రే గోరే , కార్తీక్ , జోత్స, థమన్ కోరస్
  • బాసు మనకి మెమరీ లాస్ , రవితేజ, రంజిత్, రాహూల్ నంబియార్, నవీన్ మాధవ్ .

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!