ఆదివిష్ణు |
---|
డివిడి కవర్ |
దర్శకత్వం | భరత్ పారేపల్లి |
---|
రచన | దాసరి నారాయణరావు పి. రాజేంద్ర కుమార్ (డైలాగ్స్) |
---|
తారాగణం | దాసరి అరుణ్‌కుమార్, స్నేహ |
---|
ఛాయాగ్రహణం | టి. సురేంద్ర రెడ్డి |
---|
కూర్పు | బి. కృష్ణంరాజు |
---|
సంగీతం | ఎం. ఎం. శ్రీలేఖ |
---|
విడుదల తేదీ | 21 ఆగస్టు 2008 (2008-08-21) |
---|
దేశం | భారతదేశం |
---|
భాష | తెలుగు |
---|
ఆదివిష్ణు అనేది 2008 తెలుగు యాక్షన్ డ్రామా సినిమా. భరత్ పారేపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దాసరి అరుణ్‌కుమార్, స్నేహ నటించారు.[1]
తారాగణం
నిర్మాణం
గతంలో దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయమయిన సినిమా ఇది.[2] 2008, జూలై 24 నాటికి షూటింగ్ పూర్తి చేసుకుంది.[3]
పాటలు
2008 జూలై 27న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, మోహన్ బాబు సహా ప్రముఖులు హాజరయ్యారు.[4] భాస్కరభట్ల రాసిన "రామ రామ" పాట మినహా మిగిలిన పాటలన్నీ చంద్రబోస్ రాసినవే.
స్పందన
ఫిల్మీబీట్ నుండి ఒక విమర్శకుడు "మొత్తంగా, అరుణ్‌కుమార్ పేలవమైన కథాంశంతో మరోసారి నిరాశను ఎదుర్కొన్నాడు" అని రాశాడు.[5] 123తెలుగుకి చెందిన ఒక విమర్శకుడు "అతను [దాసరి నారాయణరావు] తన కొడుకు కోసం ఇలాంటి తిరోగమన స్క్రిప్ట్‌లు రాస్తున్నాడని నమ్మడం చాలా కష్టం - అరుణ్ సినిమాల్లో విజయం సాధించడం అతనికి ఇష్టం లేదనిపిస్తోంది" అని రాశాడు.[6] ఫుల్ హైదరాబాద్‌కి చెందిన ఒక విమర్శకుడు "ఆది విష్ణు చాలా నీచమైన సినిమా, మీరు దాని తర్వాత 10 చెత్త సినిమాలు చూడాలి, ఆపై మీరు ఖర్చు చేసిన డబ్బు, సమయం గురించి మంచి అనుభూతి చెందడానికి మళ్ళీ చూడాలి" అని రాశాడు.[7]
మూలాలు