అమృతం చందమామలో 2014, మే 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర తదితరులు నటించగా, శ్రీ సంగీతం అందించాడు. అంతరిక్ష హస్య నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమిది.[3]
నటవర్గం
సాంకేతికవర్గం
నిర్మాణం
1996లో లిటిల్ సోల్జర్స్ సినిమాకు పనిచేసిన దర్శకుడు గుణ్ణం గంగరాజు, సంగీత దర్శకుడు శ్రీ కొమ్మినేని, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ముగ్గురు మళ్ళీ ఈ చిత్రం కోసం కలిసి పనిచేశారు.[1] ఈ చిత్రాన్ని చందమామలో అమృతం పేరుతో నిర్మించారు, తరువాత అమృతం చందమామలో అని మార్చారు. ఈ చిత్రంలో హైదరాబాదుకు చెందిన లాఫింగ్ డాట్స్, ఇసిఎస్ కంపెనీలు చేసిన 60 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయి. రెడ్ ఎపిక్ కెమెరా ఉపయోగించి ఈ చిత్రం చిత్రీకరించబడింది.[1][3]
పాటలు
ఈ చిత్రానికి శ్రీ సంగీతం అదించాడు.[4] ఇది శ్రీ సంగీతం అదించిన చివరి చిత్రం.[5]
పాట | గాయకులు |
---|
1. | "లక లక" | శ్యామ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ | |
---|
2. | "మూన్ లైట్ గర్ల్" | దీపు, ఎంఎల్ఆర్ కార్తికేయన్, సాహితి గాలిదేవర | |
---|
3. | "పట పలాసుల" | సాయి శ్రీకాంత్ | |
---|
4. | "బహుపరాక్" | మనో | |
---|
5. | "యరుకగా" | మనో | |
---|
6. | "ఏరువాక సాగారో" | సాహితి గాలిదేవర | |
---|
7. | "ఘలాన్ ఘలాన్" | సాయి శ్రీకాంత్ | |
---|
విడుదల
- టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది.[3]
- దక్కన్ క్రానికల్ ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రం కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు మంచి వినోదాన్ని అందిస్తుందని తెలిపింది.[2]
మూలాలు
ఇతర లంకెలు